'స్త్రీ యాత్రికులు'

 

 

                            యాత్రా సాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా ప్రయాణింప  చేయటానికి,

స్త్రీలను కూడా యాత్రలు చేయమని ప్రోత్సహిస్తూ రాసిన పుస్తకం ఇది.

జ్ఞానాన్వేషణ లో ప్రపంచ వ్యాప్తంగా  ప్రయాణాలు చేసినస్త్రీమూర్తుల సాహసోపేత జీవితాన్ని పరిచయం చెయ్యటం ఈ రచన  ముఖ్యోద్దేశం  .

యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి అందరూ ముందుకు రావాలనే ఆశయంతో

ప్రొఫెసర్ ఆదినారాయణ   సమకూర్చిన రమణీయ మణిహారం ఈ 'స్త్రీ యాత్రికులు'.

ఈ పుస్తకాన్ని 'విహంగ' చదువరుల  కోసం   ధారావాహికగా   అందిస్తున్నామని చెప్పటానికి సంతోషం గా వుంది.

 ఈ పుస్తకం రచయిత 'డా.ఆదినారాయణ' ఆంధ్ర యూనివర్సిటీ,ఫైన్ఆర్ట్స్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

ఈయన జీవితమే ఒక యాత్ర.మామూలు యాత్ర కాదు.పాదయాత్ర. విశాఖ పట్టణం నుంచి డిల్లీ కి  పాదయాత్ర చేసినా,

గుండ్లకమ్మ గట్టుని  'అడుగుల'తో  కొలిచినా... ఆయనకే చెల్లింది. 'భ్రమణ కాంక్ష ,జిప్సీలు, మహా యాత్రికులు,స్త్రీ యాత్రికులు,

డెకోరేటివ్  ఆర్ట్స్ ఆఫ్  సౌత్ ఇండియన్ టెంపుల్స్'  వీరి ఇతర రచనలు.   

రచయిత మాట :

ఈ పుస్తకం లో ఐరోపా , అమెరికా దేశాల వారి గురించి మాత్రమే రాయాల్సి వచ్చింది.ఇతర దేశాల్లో యాత్రలు చేసిన స్త్రీలు తక్కువ.

 ......'న స్త్రీ స్వాతతంత్ర్య  మర్హతి' అనే నిబంధన భారత దేశంలోని స్త్రీలకి మాత్రమే కాదు.అన్ని దేశాల్లోనూ  స్త్రీలకి విధించిన ఆంక్ష .
 
అమెరికా,ఐరోపా,ఏ దేశం వాళ్ళయినా 'తిరిగితే స్త్రీ చెడిపోతుంది' అనే భావాన్ని ప్రచారం  చేశారు.
 
తూర్పు దేశాల్లో స్త్రీల పాదాలు కట్టి  వేయడం ,పశ్చిమ దేశాల్లోని ఇనుప కచ్ఛడాలు  స్త్రీల స్వాతంత్ర్యాన్ని
 
అణచి వేసే ప్రయత్నం లో భాగాలే. గుర్రానికి కళ్ళెం వేసినట్టుగా స్త్రీల భావాలకి కూడా కళ్ళెం తయారు చేశారు. ....

ఆధునిక యుగం లో ప్రతి ఒక్కరూ తిరగక తప్పదు.జండర్  తేడా తగ్గిపోతూ వున్న రోజులివి.

అందుకే 'రాహుల్ సాంకృత్యాయన్' "తమ జన్మసాఫల్యం  చేసుకోవటానికీ ,

సమాజానికీ ,దేశానికీ కొంత మేలు చేయటానికీ .. స్త్రీలు తప్పని సరిగా లోక సంచార వ్రతాన్ని స్వీకరించాలి" అన్నాడు.

స్త్రీలు యాత్రలు చెయ్యాలి.యాత్రా సాహిత్యాన్ని  రాయటానికి ఉత్సాహం చూపాలి .

స్త్రీ యాత్రికులు అందరూ విజ్ఞానం కోసం ,ఆనందం కోసం,గ్లోబు మీద అక్షాంశాల్నీ  ,రేఖాంశాల్నీ  చెరిపేస్తారా అన్నంతగా తిరిగారు.
 
తెలుగులో యాత్రా సాహిత్యం చాల తక్కువ. 1860 వ  సం.ప్రాంతం లో శ్రీమతి పోతం జానకమ్మ 'ఇంగ్లాండ్ యాత్ర' ,

1920 సం. లో తాడూరి రామాబాయమ్మ' సిలోన్ యాత్ర ',

1967 లో నాయని కృష్ణ కుమారి ' కాశ్మీరు యాత్ర ',

ఇటీవల అబ్బూరి ఛాయా దేవి 'చైనా యాత్ర' చేసి  యాత్రా సాహిత్యాన్ని  రాశారు.

వీళ్ళంతా యాత్రీకులు కాక పోయినా  యాత్రలు చేయటం జరిగింది కాబట్టి ఆ వివరాలతో యాత్రా సాహిత్యాన్ని రాశారు. 
    
 అలా చాలా మంది యాత్రలు చేసే వుంటారు.

 తెలుగు యాత్రా సాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా  ప్రయాణింప జేయటానికి ,

యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి స్త్రీలు ముందడుగు వేయాలి.*     

.

12 వేల మంది తోడుగా యాత్రచేసిన ఎమిలీ ఈడెన్, ఫానీ ఈడెన్

28/02/2011 10:48
భారతదేశానికి గవర్నర్  జనరల్ గా పని చేసిన జార్జి  (  లార్డ్ ఆఫ్ ఆక్ ల్యాండ్ )కి సొంత చెల్లెల్లె ఈ యాత్రికులు.  వీళ్ళు  ఇంగ్లాండ్  లోని విగ్ రాజ వంశానికి చిందిన వారైనా , చాలా సామాన్యంగా  జీవించడానికి ఇష్ట...