12 వేల మంది తోడుగా యాత్రచేసిన ఎమిలీ ఈడెన్, ఫానీ ఈడెన్

01/03/2011 10:18

            భారతదేశానికి గవర్నర్  జనరల్ గా పని చేసిన జార్జి  (  లార్డ్ ఆఫ్ ఆక్ ల్యాండ్ )కి సొంత చెల్లెల్లె ఈ యాత్రికులు.  వీళ్ళు  ఇంగ్లాండ్  లోని విగ్ రాజ వంశానికి చిందిన వారైనా , చాలా సామాన్యంగా  జీవించడానికి ఇష్ట పడతారు. అందరిలాగా రాజభూగాలు అనుభవించటం  వారికి ఎప్పుడూ ఇష్టం లేదు. ఒక గొప్ప యాత్ర వలన  వారికి సాహిత్య చరిత్రలో స్థానం  దొరికింది.  ఆ యాత్రా   రచనవలన మనకి   ఉత్తర భారతదేశపు రాజకీయ చరిత్ర గురించి కూడా ఎన్నో కొత్త  విషయాలు తెలిశాయి నిజానికి ఎమిలీ ఈడెన్ కి ప్రయాణాలంటే  అసలు పడదు .  కాని అనుకోని పరిస్తితుల్లో అన్నయ్య జార్జిని ఇండియాకి గవర్నర్  జనరల్ గా నియమించటం తో అతనికి తోడుగా, జార్జికి వివాహం కాలేదు కాబట్టి,  ఇండియా కి వస్తారు అక్కచెల్లెళ్ళు ఇద్దరూ.    అప్పటికే అమ్మా నాన్న మరణించినందువల్ల వారి  కుటుంబం అంతా  విడిపోయింది. ఈ ముగ్గురు మాత్రం ఒకర్నొకరు విడిచి పెట్టకుండా ఎంతో