Events Calendar

'విహంగ' ఆవిష్కరణ

12/01/2011 07:58
 
  మనోజ్ఞ  సాంస్కృతిక సాహిత్య అకాడెమి ఆధ్వర్యం  లో 11 .01 .2011 న   'విహంగ వనితా వికాస వేదిక ' విభాగం నుంచి   'విహంగ'- తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక ఆవిష్కరించబడింది.రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియం లో పలువురు సాహితీవేత్తలు,కళాశాల విద్యార్ధినీ విద్యార్ధుల  మధ్య  ఆవిష్కరణ  వేడుకగా జరిగింది.
               ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించబడ్డ  ఆదిత్య విద్యాసంస్థల గౌరవ సలహాదారు  శ్రీ.ఎస్.పి. గంగిరెడ్డి గారు మాట్లాడుతూ -"ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. సంగీత, సాహిత్య ,నృత్య ,చిత్ర లేఖన,విద్య, వైజ్ఞానిక  రంగాలలో అభివృద్ధిని సాధించారు .కాంపస్ సెలెక్షన్ లలో సైతం అమ్మాయిలే ముందున్నారు . రాజమహేంద్రి అంటేనే సాహిత్య, సంస్కృతులకు పుట్టిల్లు ...అటువంటి పట్టణం లో ఆదిత్య  డిగ్రీ కళాశాలలో  'విహంగ' ఆవిష్కరించబడటం  ఒక చారిత్రక విశేషం.దానిలో ఈ విద్యార్ధులందరూ పాలుపంచుకోవటం సంతోషంగా వుంది.ఇది రాణ్మహేంద్రవరం  చేసుకున్న అదృష్టం.ఈ సాహితీ విహంగం  స్త్రీ ఉన్నతిని  ఆకాశపు  అంచుల దాకా ఎగరేయాలి"అన్నారు. 
                                సభాధ్యక్షులు ఎమ్మెస్సెన్ గారు మాట్లాడుతూ "మహిళలు అభివృద్ధి చెందటం, అధ్బుతాలు సాధించటం ఇది కొత్త కాదు.. ఎన్నో విజయాలు  మహిళల  స్వంతం.ఈ పత్రిక  మంచి రచనలకు వేదిక కావాలి  " అన్నారు.
                      తదనంతరం  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య
పీఠాధిపతి - ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ "నేడు గ్లోబలైజేషన్ కారణంగా  ప్రపంచం ఒక కుగ్రామమైపోయింది .మన్ను తిన్న కృష్ణుని నోట్లో యశోద ఎలా విశ్వరూపాన్ని చూసిందో  , అలాగే ఇప్పుడు  ఇంటర్నెట్లో విశ్వ సందర్శనం చెయ్య గలుగుతున్నాం.స్త్రీల సమస్యలకి ,చర్చలకి,ఈ పత్రిక నెలవు కావాలి. ఈ స్త్రీవాద పత్రిక కి  'ఆదిత్య' వేదిక కావటం..ఈ విద్యార్ధులంతా  రాజమహేంద్రి సాహిత్య చరిత్ర లో పాలుపంచుకోవటం ... మంచి విషయం " అన్నారు.

విహంగ మహిళా సాహిత్య పత్రిక సంపాదకురాలు పుట్ల హేమలత మాట్లాడుతూ   -

అంతర్జాలం లోమహిళల కోసం ఒక్క  వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణమనీ 

ఉన్న ఒకటి , అరా పత్రికలు కూడా ప్రింట్ మీడియా  నుంచి  వెబ్ కి తరలించబడ్డవే అనీ అన్నారు.

అయినా స్త్రీల సాహిత్య పరిమాణం  కొరతగానే ఉన్నందు వల్ల   ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం,

పత్రికలు  అంతర్జాలంలో కాలు మోపాలని ఆకాంక్షించారు .

పలు సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న…

‘మనోజ్ఞ  సాంస్కృతిక సాహిత్య అకాడమీ’ సంస్థ ఆధ్వర్యం లో తెలుగు మహిళల భావోద్వేగాలకు

వేదిక గా ’విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా  ఈ ప్రత్యేక దినమైన 11-1-11(2011)న  అంతర్జాలపు  వినువీధుల్లో

సగర్వంగా ఎగరేస్తున్నామని తెలియజేసారు.

‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను , అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుందనీ ,విశాల భావాల పట్ల ఆదరణ చూపుతుందనీ వైజ్ఞానిక ,మనోవికాసానికి స్వాగతం పలుకుతుందానీ తెలియజేసారు.  

                  ఈ సందర్భంగా విద్యార్ధినులు "విహంగ" ని ఆవిష్కరించారు.పాటలు పాడారు.కవితాగానం చేశారు.

     చివరగా ఆదిత్య తెలుగు ఉపన్యాసకురాలు బి.హెచ్ .రమాదేవి శుభాకాంక్షలు ,వందన సమర్పణ తో సభ ముగిసింది.
                                                                                                             

                                        -బి.హెచ్ .రమాదేవి.

 

సమీక్షలు/సాహిత్య సభలు

This section is empty.